ధాన్యం సేకరణకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు సహకరించండి

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి

మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశం

ఇబ్రహీంపట్నం రూరల్‌: వేసవిలో వరిధాన్యం సేకరణకు మిల్లర్స్‌ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి కోరారు. బుధవారం ఆయన సివిల్‌ సప్లయ్‌ అధికారి, డీసీఎంఎస్‌, మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులందరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి 2025–26 వరిధాన్యం నిల్వలకు స్థలం కల్పించేందుకు, సీఎంఆర్‌ డెలివరీ వేగవంతం చేయాలన్నారు. వీసీ ఎండీ ఇచ్చిన ఒప్పందం ప్రకారం రబీ 2025–26 వరి ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ కార్యకలాపాల కోసం డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. గత సీజన్లలో తిరిగి ఇవ్వాల్సిన ఉపయోగపడే పాత గోనే సంచులను గరిష్ఠ సంఖ్యలో డీఎంసీఎస్‌సీకి ఎలాంటి ఆలస్యం లేకుండా తిరిగి ఇవ్వాలని సూచించారు. వరి సేకరణ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు , సివిల్‌ సప్‌లైస్‌ కమిషనర్‌ జారీ చేసిన సూచనలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయి జిల్లా అధికారి వనజాత, మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు .

Advertisement
 
Advertisement
Advertisement