ఇబ్రహీంపట్నం: బీఆర్‌ఎస్ నాయకుడు, ఉద్యమకారుడైన కర్నె అరవింద్ కుటుంబానికి అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సోదరుని కుమారుడైన కర్నె అరవింద్ గుండెపోటుతో ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం ఇబ్రహీంపట్నంలోని అరవింద్ నివాసానికి వేర్వేరుగా వచ్చిన ఇరువురు నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి, పల్లె గోపాల్‌గౌడ్, కిరణప్ప, మంద సురేష్, రమేష్‌గౌడ్, జెర్కొని రాజు, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు


