షాద్‌నగర్‌రూరల్: నిరుపేదలకు సేవ చేయడమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆంధ్ర, తెలంగాణ క్షేత్రప్రముఖ్ బండారి రమేశ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం బండారి రమేశ్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపాటి అనారోగ్యానికి గురైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వైద్యశిభిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శివానంద్, కార్తికేయ, మల్లిక, బుచ్చయ్య, వెంకటేశ్, తిరుపతి, ఆంజనేయులు, పద్మనాభం, వీహెచ్‌పీ నాయకులు మఠం రాచయ్య, భాగ్యవతి, నాగేశ్వర్ పాల్గొన్నారు.
వీహెచ్‌పీ ఆంధ్ర, తెలంగాణ క్షేత్ర
ప్రముఖ్ రమేశ్


