గ్యాస్‌ సిలిండర్ల కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్ల కోసం ఆందోళన

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

కొందుర్గు: తమకు సకాలంలో గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేయడం లేదని బుధవారం మండల కేంద్రంలో గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. షాద్‌నగర్‌–పరిగి రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ.. గ్యాస్‌ బుకింగ్‌ చేయడానికి నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ఎన్నిసార్లు బుక్‌చేసినా గ్యాస్‌ బుక్‌ కావడం లేదని వాపోయారు. గ్యాస్‌ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని వినియోగదారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement