ఆమనగల్లు: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. మంగళవారం ఆయన సర్పంచ్ డోకూరు సునీతతో కలిసి తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డైరెక్టర్లు అంజయ్యగుప్తా, అజీం, వెంకట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకురు ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ కేశవరెడ్డి, లింగరావ్‌పల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, డేవిడ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన హైటెన్షన్ లైన్ బాధితులు
కడ్తాల్: వ్యవసాయ పొలాల మీదుగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేస్తున్న బీదర్–మహేశ్వరం 765 కేవీ హైటెన్షన్ విద్యుత్‌లైన్ అలైన్‌మెంట్ మార్చి తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు మంగళవారం ఎమ్మెల్యేకు విన్నవించారు. రైతుల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, నాయకులు పెంటారెడ్డి, రామకృష్ణ, రాజేందర్‌యాదవ్, శేఖర్‌రెడ్డి, జంగయ్యయాదవ్, కృష్ణ, పర్వత్‌కుమార్, తదితరులు ఉన్నారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


