ఇబ్రహీంపట్నం: బడ్జెట్‌లో కోత విధించి.. దళితులను ప్రభుత్వం మోసం చేసిందని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు ఆరోపించారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. 2025– 26 బడ్జెట్‌లో దళితులకు రూ.40 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 2026– 27లో కేవలం రూ.11,784 కోట్లు మాత్రమే కేటాయించిందని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఎక్స్‌గ్రేషియాలు వేలాది మందికి అందలేదన్నారు. ఎస్సీ జనాభా 18 శాతం ఉండగా.. నిధుల కేటాయింపు అరకొరేనన్నారు. మూడేళ్ల కాలంలో దళితుల కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య మాట్లాడుతూ.. బడ్జెట్ తగ్గించడాన్ని ఖండిస్తుందన్నారు. జానాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సామేల్, ప్రకాశ్‌కారత్, మనోహర్, ఆనంద్, వీరేశం, ఎల్లేష్, శంకర్, గణేశ్, యాదగిరి, విజయ్, జగన్‌లు పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు


