కడ్తాల్: మండల పరిధిలోని పెద్దారెడ్డిచెరువుతండాకు చెందిన వడ్త్యావత్ నంద్యానాయక్ ఆకస్మికంగా మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని శనివారం ఉదయం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్‌నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఎక్వాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్‌తండాలో మృతి చెందిన సభావత్ లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. స్థానిక నాయకులు మహేశ్‌యాదవ్ తనవంతుగా రూ.5 వేలు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, నాయకులు వెంకటయ్య, రాజునాయక్, మల్లేశ్, శ్రీశైలం, గోపీ, బాలు, మహేశ్ తదితరులు ఉన్నారు.
తండా అభివృద్ధే ధ్యేయం
కడ్తాల్: గానుగుమర్లతండాను అభివృద్ధే ధ్యే యమని సర్పంచ్ సేవ్యానాయక్ అన్నారు. తండాలోని 2వ వార్డులో జీపీ నిధులతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో మౌ లిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతో పాటు నీటి సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అఖిల, గణేశ్, శ్రీను, స్వప్న, రాజు, నాగార్జున్, కవిత, గోపీ, చాంది, పాండు, భీమన్, సకృ, కిషన్, హీరాసింగ్, లాలునాయక్, శ్రీను, జీవన్ తదితరులు ఉన్నారు.


