పెళ్లికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదం

Mar 22 2026 1:29 AM | Updated on Mar 22 2026 1:29 AM

పూడూరు: బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు వెళ్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్‌ మండలం పల్సాపూర్‌ పరిధిలో పలుగురాళ్ల తండాకు చెందిన కిషన్‌నాయక్‌ నగరంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం ఆయన తన భార్య కవిత ముగ్గురు పిల్లలతో నగరం నుంచి బొంరాస్‌పేట్‌ మండలం బొట్లవోనితండాలో ఆదివారం జరిగే వారి బంధువుల పెళ్లికి ఆటోలో బయలు దేరారు. మార్గమధ్యలో పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల సమీపంలోకి రాగానే పరిగి నుంచి వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న కిషన్‌నాయక్‌కు తీవ్రగాయాలు కాగా, వారి పిల్లలైన పూజ, శ్రీనివాస్‌, అక్షితలకు గాయాలయ్యాయి. కవితకు స్పల్వగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను 108లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో నడుపుతున్న కిషన్‌నాయక్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు పిల్లలతో సహా దంపతులకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement