జిల్లా వైద్యాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన డ యాలసిస్ సేవల విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య స్పందించారు. ఈ విషయమై శనివారం ప్రచురితమైన వా ర్తలతో ఆయన వెంటనే ఆ స్పత్రిలోని డయాలసిస్ కేంద్రానికి చేరుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న పాలియేటివ్ కేర్ సెంటర్‌లో సేవలు పునరుద్ధరించాలని ఆదేశించారు. జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి(డీసీఎహెచ్‌ఎస్) అనురాగిణితో ఫోన్‌లో మాట్లాడి షిఫ్టింగ్ చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె ఆదివారం పరిశీలించి బాధితులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కె.రాములుగౌడ్, కౌన్సిలర్లు శైలజాఆగిరెడ్డి, ఎం.శ్రీనివాస్, కృష్ణనాయక్, ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి.రాములు, నాయకులు చింటు తదితరులు ఉన్నారు.


