ఎకరాకు రూ.ఆరు వేల చొప్పున జమ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నగదు ఆదివారం నుంచి రైతుల ఖాతా ల్లో జమ కానుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి దశలో ఎకరంలోపు రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. ఆ తర్వాత రెండు, మూడు దశల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. నిజానికి యాసంగికి ముందే ఈ సహాయం అందజేయాల్సి ఉంది. పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. నేటి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయ నుంది. రంగారెడ్డిజిల్లాలో 2,83,709 లక్షల మంది రైతులు ఉండగా, వీరు 6,35,502 ఎకరాలకుగాను సాయం పొందనున్నారు. ఈ జిల్లా రైతుల ఖాతాల్లో రూ.318 కోట్లకుపైగా జమకానుండగా, వికారాబాద్ జిల్లాలో 3,27,561 మంది రైతులు ఉండగా, వీరు 6,45,166 ఎకరాలకు రైతుభరోసా పొందనున్నారు. కొత్తగా మరో 15,784 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఖాతాల్లో రూ.387 కోట్లకుపైగా జమకానుంది. ఈ కార్యక్రమాన్ని రైతులు వీక్షించేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆయా రైతు వేదికల్లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేశారు.
సంతాప సభను
విజయవంతం చేయండి
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య
ఇబ్రహీంపట్నం: దివంగత ఎమ్మెల్యే కొండిగారి రాములు ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర నాయకులు కె.నర్సింహ, ఒ.యాదయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాములు సాదాసీదాగా జీవనం సాగించి రైతులు, కార్మికులు, పేదల పక్షాన పోరాడారని గుర్తు చేశారు. ఈ నెల 31న నిర్వహించనున్న సంతాప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నీలమ్మ, శివకుమార్, రాజు, ఎం.నర్సింహ, జె.నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
పండుగ పూట విషాదం
స్కూటీపై నుంచి పడి
ఎలక్ట్రీషియన్ దుర్మరణం
పహాడీషరీఫ్: పండుగ పూట జరిగిన ప్రమా దం ఓ ముస్లిం కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శని వారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఎంఎస్‌ఆర్‌వీ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. మెహదీపట్నం సాబెర్ నగర్ మహవీర్ కాలనీకి చెందిన మహ్మద్ ఇషాక్ కుమారుడు మహ్మద్ అమన్(23) ఎలక్ట్రీషియన్. ప్రస్తుతం ఆయన షాహిన్‌నగర్ వాదే సాల్హెహీన్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం 7.30 గంటలకు అమన్ తన యాక్టివాపై ఎర్రకుంట నుంచి ఇంటికి వెళుతున్నాడు. జాతర మండి హోటల్ వద్దకు రాగానే వేగం, నిర్లక్ష్యంగా వచ్చిన హోండా షైన్ బైక్ ఒక్కసారిగా మలుపుతీసుకోవడంతో వెనుక నుంచి వస్తున్న అమన్ ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. మృతుడికి వరుసకు సోదరుడు తౌహిద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
రాజ్‌కుమార్ గౌడ్


