రైతుల పక్షాన పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

రైతుల పక్షాన పోరాడుతాం

Mar 22 2026 2:04 AM | Updated on Mar 22 2026 2:04 AM

● మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌

తుర్కయంజాల్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఓట్లతోనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారనే విషయం మరిచారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదిబట్ల సర్కిల్‌ పరిధి కొహెడలో భూ బాధితుల సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మహాధర్నాకు సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తరతరాలుగా పేదలు సాగు చేసుకుని ఉపాధి పొందుతున్న భూములను ప్రభుత్వం లాక్కోవడంతో వారు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పండ్ల మార్కెట్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయా ల నిర్మాణానికి సర్వే నెంబర్‌ 167/1లో పేదలు సా గు చేసుకునే భూములకు బదులుగా ప్రభుత్వ ఆధీ నంలో ఉన్న భూములను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. భూములను కోల్పోతున్న రైతులకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందించాలని, లేదంటే రైతుల పక్షాన బీజేపీ పోరాడటానికి సిద్ధంగా ఉందని హెచ్చచరించారు. అంతకు ముందు రైతులు ప్రభు త్వ నిర్ణయానికి నిరసనగా ఎడ్ల బండ్లతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తుర్కయంజాల్‌ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, నాయకులు కందాల బలదేవ్‌ రెడ్డి, సానెం అర్జున్‌ గౌడ్‌, బచ్చిగళ్ల రమేశ్‌, కొత్త రాంరెడ్డి, జగన్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement