కదిలిస్తే..కన్నీళ్లే.. | - | Sakshi
Sakshi News home page

కదిలిస్తే..కన్నీళ్లే..

Nov 5 2025 9:10 AM | Updated on Nov 5 2025 9:10 AM

కదిలిస్తే..కన్నీళ్లే..

కదిలిస్తే..కన్నీళ్లే..

● కూతురే కొండంత ధైర్యంగా ఉండేది

మీర్జాగూడ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.. తమ వారిని తలచుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. అశ్రునయనాలతో కడసారిగా సాగనంపారు.. నిన్నటివరకు తమతోనే ఉన్నవారు ఇక తిరిగిరారన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు.. ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. అంతులేని ఆవేదనే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఏ నోట విన్నా ‘అయ్యో ఎంతటి ఘోరం’ అన్న మాటలే.. మరోవైపు ప్రమాదంలో గాయపడినవారు ఆయా ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.. తమవారిని ఈ స్థితిలో చూసి అయినవారు తల్లడిల్లిపోతున్నారు..

తేరుకోని బాధితులు తల్లడిల్లిన హృదయాలు అంతులేని విషాదం నింపిన మీర్జాగూడ ప్రమాదం

మృతురాలి తండ్రి చాంద్‌పాషా ఆవేదన

తాండూరు రూరల్‌: మండలంలోని కరన్‌కోట్‌ గ్రామానికి చెందిన చాంద్‌పాషా గౌతాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె పెళ్లి చేసి అత్తారింటికి పంపాం. చిన్న కూతురు ముస్కాన్‌ బేగం. తాండూరులో ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ముస్కాన్‌బేగం నాకు కొండంత ధైర్యమని చాంద్‌పాషా తెలిపాడు. కొడుకు లేడన్న లోటును తీర్చిందన్నారు. వ్యాపారంలో, కుటుంబ విషయంలో ఆమె చెప్పినట్లే వినేవాడిని పేర్కొన్నారు. చదువులో ఫస్ట్‌గా ఉండేదని, వ్యాపారం లేదా టీచర్‌ ఉద్యోగంలో రాణిస్తానని చెప్పేదన్నారు. బస్సు ప్రమాదంలో చిన్న కూతురు చనిపోయిందని ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నానని తెలిపారు.

మృత్యువులోనూ వీడని స్నేహం

యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ముస్కాన్‌బేగంకు సాయిప్రియ తోపాటు అమె చెల్లి, అక్క స్నేహితులు. అందరూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. కళాశాలకు సెలవు ఉంటే అందరూ తాండూరు వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసే హైదరాబాద్‌ వెళ్తారు. ఇలా సోమవారం తెల్లవారుజమూనా కూడా నగరానికి వెళ్తూ కానరాని లోకానికి వెళ్లిపోయారని తండ్రి చాంద్‌పాషా ఆవేదన వ్యక్తం చేశారు.

చాంద్‌పాషా

అయినవారి ఆక్రందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement