
పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యత
యాచారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని అడిషనల్ డీఆర్‌డీఓ సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని గునుగల్, యాచారం గ్రామాల్లోని జీపీ ల్యాండ్స్, వెంచర్లలోని పది శాతం భూముల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాల్లో ఏర్పాటయ్యే వెంచర్లలో పంచాయతీలకు రిజిస్ట్రేషన్లు చేసిన పది శాతం భూముల్లో విరివిగా మొక్క లు నాటాలని సూచించారు. గ్రామాల్లోని కాలనీలు, రోడ్ల వెంట, పార్క్ స్థలాల్లో మొక్కలు నాటా లని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ చేయాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. ఈజీఎస్ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని, అర్హులైన ఆసక్తి కలిగిన రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, ఈజీఎస్ ఏ పీఓ లింగయ్య, ఈసీ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
మంచాల: గ్రామాల్లో మొక్కల పెంపకం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సుభాషిణి అన్నారు. సోమవారం మండలంలోని ఆగాపల్లి, కాగజ్‌ఘట్ గ్రామాల్లో ఎన్‌ఆర్ ఈజీఎస్ పథకం కింద నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడమేగాకుండా వాటిని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వీరాంజనేయులు, ఈసీ విమల, పంచాయతీ కార్యదర్శులు అనిల్, శ్రీ ను, హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్‌డీఓ సుభాషిణి