పార్టీకోసం పనిచేసేవారికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

పార్టీకోసం పనిచేసేవారికి పెద్దపీట

Oct 14 2025 8:55 AM | Updated on Oct 14 2025 8:55 AM

పార్టీకోసం పనిచేసేవారికి పెద్దపీట

పార్టీకోసం పనిచేసేవారికి పెద్దపీట

● పారదర్శకంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ● ఏఐసీసీ పరిశీలకుడు, ఎంపీ రాబర్ట్‌ బ్రూస్‌

చేవెళ్ల: పార్టీని పటిష్ట పరిచి రెండోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు జిల్లా కమిటీలో ఎన్నికై న అధ్యక్షులు పనిచేయాల్సి ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్‌, తిరునల్వేలి ఎంపీ రాబర్ట్‌ బ్రూస్‌ అన్నారు. మండలకేంద్రంలో సోమవారం డీసీసీ అధ్యక్ష ఎన్నికపై అభిప్రాయసేకరణ సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాబర్ట్‌ బ్రూస్‌తోపాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, పీసీసీ ఉపాధ్యక్షులు వినయ్‌రెడ్డి, విజయారెడ్డి, కార్పొరేషన్‌ల చైర్మన్‌లు ఒబెదుల్లా కొత్వాల్‌, చల్లా నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకునే వారు, పోటీ చేస్తున్న వారిలో ఎవరికి మద్దతిస్తున్నారు తదితరాలపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా రాబర్ట్‌ బ్రూస్‌ మాట్లాడుతూ.. పార్టీకోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు అవకాశం కల్పించాలని.. ఎవరి ప్రమేయం, సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలిపా రు. జిల్లా పరిఽధిలోని 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే విధంగా నాయకుడు ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, పీసీసీ నా యకుడు జనార్దన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు వసంతం, షాబాద్‌ దర్శన్‌, జిల్లా నాయకులు గౌరీ సతీష్‌, ఆగిరెడ్డి, పీఏసీఎస్‌, మార్కెట్‌ కమిటీల చైర్మ న్‌లు వెంకట్‌రెడ్డి, పెంటయ్యగౌడ్‌, సురేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె. శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమావేశం రసాభాస

నియోజకవర్గంలో ఉన్న వర్గపోరు మరోసారి బయటపడింది. నేతల ప్రసంగాలు ముగిసిన అనంతరం పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ పార్టీలో బీసీలకు గౌరవం దక్కడం లేదని, అభిప్రాయ సేకరణలో కూడా ఒక వర్గం నాయకులకే అవకాశం ఎలా ఇస్తారని వాదించారు. దీంతో అక్కడే ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే, మీరు పార్టీ సమావేశాలు పెట్టినప్పుడు మాకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇరువురి వాదనలతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో అద్దంకి దయాకర్‌, చల్లా నర్సింహారెడ్డి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.

పాత.. కొత్త నాయకుల అభిప్రాయంతోనే..

శంకర్‌పల్లి: పార్టీలోని పాత, కొత్త నాయకుల సమష్టి అభిప్రాయంతోనే జిల్లా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ రాబర్ట్‌ బ్రూస్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, మరో ఇద్దరు పరిశీలకులు, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యకర్తలు తమకు నచ్చిన వ్యక్తిని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బలమైన నాయకుడిని ఎంపిక చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్‌, నాయకులు మధుసూదన్‌రెడ్డి, గౌరీ సతీష్‌, ఉదయ్‌ మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భీంభరత్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశం

సమావేశం సందర్భంగా పామెన భీంభరత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. పార్టీలోకి ఎంతో మంది వస్తారు, పోతారు.. ఎవరున్నా, లేకున్నా పార్టీ ఎక్కడికి పోదు అన్నారు. పదవుల విషయంలో ప్రతీసారి చేవెళ్ల నియోజకవర్గ నాయకులకు అన్యాయం జరుగుతోందని, ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి ఇక్కడి నాయకులకు ఇవ్వాలని కోరారు. దీనిపై పరిశీలకులు స్పందిస్తూ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement