సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి

Oct 14 2025 8:55 AM | Updated on Oct 14 2025 8:55 AM

సీఎంన

సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి

ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసిన ఆచారి ఈనెల 31న జరిగే తన కుమారుడు భరత్‌ నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు. నాలుగు మండలాల కూడలి అయిన ఆమనగల్లు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని డివిజన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అంతకుముందు ముఖ్యమంత్రిని సత్కరించారు.

ముఖ్యమంత్రిని కలిసిన ఆసీఫ్‌అలీ

కడ్తాల్‌: సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మండల కేంద్రానికి చెందిన రేవంత్‌మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌అలీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు.

ముగిసిన హార్స్‌ రైడింగ్‌ పోటీలు

శంకర్‌పల్లి: మండల పరిధిలోని జన్వాడలో ఉన్న నాసర్‌ పోలో హార్స్‌ రైడింగ్‌ అకాడమీలో మూడు రోజుల పాటు నిర్వహించిన హైదరాబాద్‌ హార్స్‌ షో మాన్సూన్‌–2025 చాంపియన్‌ పోటీలు సోమవారం ముగిశాయి. షో జంపింగ్‌, డ్రెసాజ్‌ విభాగాల్లో ఈ పోటీలను అండర్‌–10, –12, –14, –16 ఓపేన్‌ కేటగిరీల్లో నిర్వహించగా సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నాసర్‌ పోలో హార్స్‌ రైడింగ్‌ అకాడమీ చైర్మన్‌ కుతుబుద్దీన్‌ ఖాన్‌ బహుమతులు అందజేశారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

షాద్‌నగర్‌రూరల్‌: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్‌నగర్‌ డిపో మేనేజర్‌ ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని కోరారు. 99592 26287 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.

డిప్యూటీ కలెక్టర్‌గా

ఎంపికై న వీణకు శిక్షణ

ఇబ్రహీంపట్నం: గ్రూప్‌–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా (ఆర్డీవో స్థాయి) ఎంపికై న నారాయణపేట జిల్లాకు చెందిన ఎస్‌.వీణ శాఖాపరమైన శిక్షణ పొందేందుకు ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయానికి అలాట్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమ వారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాయానికి వచ్చిన వీణ తహసీల్దార్‌ సునీతారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. మూడు వారాల పాటు జీపీఓగా, వారం పంచాయతీ కార్యదర్శిగా, మూడు వారాల పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఆమె శిక్షణ పొందనున్నారు.

లోడ్‌ లారీలతో

రోడ్లు ధ్వంసం

పహాడీషరీఫ్‌: జల్‌పల్లి పరిసరాల్లో రాత్రి పూట అక్రమంగా తిరుగుతున్న మట్టి, బండరాళ్ల లారీలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా గ్రామ శివారులోని భారీ క్వారీని పూడ్చేందుకు కొందరు రాత్రి పూట వందల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి బండరాళ్లు, మట్టిని తీసుకొస్తున్నారు. ఎవరూ చూడరనే ఉద్దేశంతో భారీ లారీల్లో ప్రమాదపుటంచున నింపి తరలిస్తుండడంతో బండరాళ్లు కింద పడిపోతున్నాయి. మామిడిపల్లి రోడ్డులో అర్ధరాత్రి బండరాయి కింద పడడంతో వెనుకాల వస్తున్న కారు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. భారీ లోడ్‌ బండ్లతో కొత్తగా వేసిన రోడ్లు సైతం దెబ్బతింటున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై బాలాపూర్‌ మండల రెవెన్యూ అధికారులు, పహాడీషరీఫ్‌ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సీఎంను కలిసిన  బీజేపీ నేత ఆచారి
1
1/2

సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి

సీఎంను కలిసిన  బీజేపీ నేత ఆచారి
2
2/2

సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement