
ఎరువుల కొరత లేకుండా చూడాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం అధికారులతో సమన్వయ సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..పత్తి,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇ ళ్లకు ఫేజ్‌లవారీగా బిల్లులు ఇచ్చేలా చూడాలన్నారు. గ్రామ, మున్సిపాలిటీ స్థాయిలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందు ఉంచేలా కృషి చేయాలన్నారు.
ప్రజావాణికి 48 దరఖాస్తులు
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేరుగా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి 48 అర్జీలు అందినట్టు తెలిపారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిన్నారులకు పోలియో చుక్కలు
తుక్కుగూడ:పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అ న్నారు.కలెక్టర్ కార్యాలయంలో సోమవారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మిగిలిపోయిన పిల్లలను గుర్తించి వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలన్నారు. పౌల్ట్రీఫామ్‌లు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణల వద్ద చిన్నారులను విస్మ రించొద్దని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.