
ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు
షాద్‌నగర్: చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. పోషణ్ అభియాన్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చించోడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారుల తల్లులకు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహించొద్దని సూచించారు. చిన్నారులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని అన్నారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఎంఈఓ మనోహర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యను అభ్యసించి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్న ప్రాసన, గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సవ్రంతి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, హెచ్‌ఎం రాంచందర్, ఎన్జీఓ సభ్యులు నవ్య, తులసి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి