
ఆలయాల అభివృద్ధికి ‘ఐక్యత’ సహకారం
ఆమనగల్లు: ఆలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందిస్తుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ పరిధిలోని కర్కస్‌తండాలో మంగళవారం సుంకిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యాలుగా ఐక్యత ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పారు. అలాగే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయాల పునరుద్ధరణ, అబివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణం కోసం ఆర్థికసహాకారం అందిస్తున్నామని వివరించారు. కల్వకుర్తి నియోజక వర్గంలో ఇప్పటివరకు 160 ఆలయాల అభివృద్ధికి సాయం అందించామని ఆయన గుర్తుచేశారు. కర్కస్‌తండాలో ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, నాయకులు శంకర్‌నాయక్, నర్సింహ, రవి, కరుణాకర్‌రెడ్డి, గోపాల్‌నాయక్, శ్రీను, శివాజీ, మల్లేశ్, రాజేందర్, నార్య, సంతోశ్, కృష్ణ, బాలకోటి, దేవేందర్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి