
వాటర్‌మెన్ మృతి
కందుకూరు: కందుకూరు పంచాయతీ పరిధిలో వాటర్ మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న రొట్టెల అంజయ్య(59) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటూనే విధులకు హాజరవుతున్నారు. సోమవారం రాత్రి మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మరణించారు. ఆయన గత 25 ఏళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
పనికోసం వచ్చిన కూలీ అదృశ్యం
మొయినాబాద్‌రూరల్: పనికోసం వచ్చిన కూలీ అదృశ్యమయ్యా డు. ఈ ఘటన మొయి నాబాద్ ఠాణా పరిధిలోని అజీజ్‌నగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జార్ఖ్‌ండ్‌కు చెందిన సుదేశ్ బ్రిజియా ఈ నెల 11వ తేదీన అజీజ్‌నగర్ సమీపంలో శ్రీనిధి పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బావమరిది అరుణ్ బ్రిజియా వద్దకు వచ్చాడు. ఈ నెల 12న సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు మంగళవారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎయిర్‌పోర్టులో ఈ–సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: దుబాయ్ నుంచి పెద్ద మొత్తంలో ఈ–సిగరెట్లతో పాటు విదేశీ సిగరెట్లు తీసుకొచ్చిన ప్రయాణికులు సీఐఎస్‌ఎఫ్ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. దుబాయ్ నుంచి ఈకే–524 విమానం మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు తనిఖీలు పూర్తి చేసుకుని అరవైల్ బయటికి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన సీఐఎస్‌ఎఫ్ అధికారులు అతడిని వద్ద ఉన్న మూడు నల్లరంగు పెద్ద బ్యాగులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో 259 ఈ–సిగరెట్లతో పాటు 200 బాక్సుల విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. తీసుకొచ్చిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు పెరుమల్‌పట్టుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తీసుకొచ్చిన సిగరెట్లను అతడి నుంచి తీసుకునేందుకు డిపార్చుర్ దగ్గర ఉన్న వ్యక్తి మహ్మద్ ఇంతియాజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సిగరెట్లతో పాటు నిందితులిద్దరిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

వాటర్‌మెన్ మృతి

వాటర్‌మెన్ మృతి