
తప్పిపోయిన వ్యక్తి అప్పగింత
మంచాల: ఏడాది కిందట తప్పిపోయిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన మంచాల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా జగ్గసాగర్ గ్రామానికి చెందిన పూసల నరేందర్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోవడమేగాకుండా మతి స్థిమితం కోల్పోయాడు. దీంతో భిక్షాటన చేస్తూ మండలంలోని ఆగాపల్లి సమీపంలో కనిపించాడు. స్థానికుల సహాయంతో దయనీయ స్థితిలో ఉన్న నరేందర్‌ను మానవ సేవ ఆశ్రమం నిర్వాహకులు చేరదీశారు. 2025 జనవరిలో వారి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో నరేందర్ తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఆగాపల్లిలో మానవ సేవ ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించారు. నరేందర్‌ను వివరాలు అడిగి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం కుటుంబ సభ్యులైనా భార్య శ్రీలత, బావమరిది అనిల్‌కుమార్ రావడంతో అప్పగించారు. ఏడాది తర్వాత నరేందర్ కలవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ సతీష్ తదితరులు ఉన్నారు.