సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు

Oct 7 2025 4:52 AM | Updated on Oct 7 2025 4:52 AM

సత్తా

సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు

నలుగురికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు

ఆమనగల్లు: పట్టణానికి చెందిన సోను కరాటే అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించినట్లు సోను కరాటే అకాడమీ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు సోను తెలిపారు. చైన్నెలోని ఎస్‌ఐ వీఐటీ కాలేజీలో కరాటే మాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మాస్టర్‌ బాలమురుగన్‌ సమన్వయంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు అధికార ప్రతినిధి రిషినాద్‌ సమక్షంలో సోను కరాటే అకాడమీ విద్యార్థులు శ్రీయాన్ష్‌, యశ్వంత్‌, నిద్విక్‌గౌడ్‌, యాస్మిన్‌లు కరాటేలో తమ ప్రతిభను కనబర్చి గత రికార్డులను బ్రేక్‌ చేశారు. అనంతరం విద్యార్థులకు రిషినాద్‌ గిన్నిస్‌ మెడల్‌, సర్టిఫికెట్‌ అందించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చైన్నె లయన్స్‌క్లబ్‌ జిల్లా గవర్నర్‌ ఏకేఎస్‌ వినోద్‌ సర్వాగి, మాజీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ శరవనన్‌లు అభినందించారు.

‘డబుల్‌’ ఇళ్లలో కార్డన్‌ సెర్చ్‌

శంకర్‌పల్లి: పట్టణ శివారులోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో సోమవారం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ సెర్చ్‌లో సుమారు 150 మంది పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 1500 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆధార్‌ కార్డులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో అడిషనల్‌ డీసీపీ కేఎస్‌ రావు, నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌, రాజేంద్రనగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి బలవన్మరణం

నవాబుపేట: ఆర్థిక ఇబ్బ ందులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం చిట్టిగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పుండ్లక్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన జంగ రాములు(50) శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ నంబర్‌ 20లో 20 ఏళ్లుగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో 1.05 ఎకరాల పొలం ఉండగా ఈ ఏడాది పత్తి సాగు చేశాడు. వర్షాలకు పంట పూర్తిగా పాడైంది. ఆయన కుమారులు వెంకటేశ్‌ డిగ్రీ మొదటి సంవత్సరం, నికిల్‌ 10వ తరగతి చదువుతున్నాడు. కూతురు శిరీష అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటోంది. రాములు రోజు మాదిరి గానే సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. ఇంటి సమీపంలో చింత చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు తెలపడంతో మృతదేహానికి వికారాబాద్‌ ప్రభుత్వా స్పత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యు లకు అప్పగించారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పుట్టింటికి వచ్చిన మహిళ అదృశ్యం

దుద్యాల్‌: పండుగకు తల్లిగారింటికి వచ్చిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన దుద్యాల్‌ ఠాణా పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ యాదగిరి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పోలేపల్లికి చెందిన కొత్తూరు బాలమణికి పొరుగు రాష్ట్రానికి చెందిన రాజుతో వివాహమైంది. వీరు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ జీవన సాగిస్తున్నారు. దసరా నేపథ్యంలో ఈ నెల 1వ తేదీన పోలేపల్లికి బాలమణి తన కుమారుడితో కలిసి వచ్చింది. ఆమెకు కుమారుడు కొడంగల్‌ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. దీంతో ఈ నెల 5వ తేదీన బాబును పాఠశాలకు పంపిస్తానని తల్లి అంజిలమ్మకు చెప్పి బయలుదేరింది. పాఠశాలలో బాబును వదిలిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో అంజిలమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు 
1
1/2

సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు

సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు 
2
2/2

సత్తా చాటిన సోను అకాడమీ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement