సొంత ఖర్చులతో రోడ్డు పనులు | - | Sakshi
Sakshi News home page

సొంత ఖర్చులతో రోడ్డు పనులు

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

సొంత ఖర్చులతో రోడ్డు పనులు తడి, పొడి చెత్తగా వేరు చేయాలి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి’ ● మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): సొంత నిధులతో గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు సర్పంచ్‌, ఉపసర్పంచులు. ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లికి రోడ్డు లేకపోవడంతో సర్పంచ్‌ చింతమడక కళ్యాణ్‌, ఉపసర్పంచ్‌ చిక్కుడు సత్యం తమ సొంత ఖర్చులతో గ్రామం నుంచి రామాజీపేట బీటీ రోడ్డు వరకు రోడ్డు పనులు శనివారం ప్రారంభించారు. రెండు కిలోమీటర్లు, 25 ఫీట్లతో మట్టి రోడ్డు నిర్మించనున్నట్లు సర్పంచ్‌, ఉపసర్పంచులు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి రూ.2లక్షల వరకు అవుతున్నాయి.

సిరిసిల్లటౌన్‌: చెత్తను తడి, పొడిగా వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా శనివారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) ఆధ్వర్యంలో స్థాని క పాత బస్టాండ్‌ ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగించొద్దని ప్రజలకు వివరించారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్లు సోషల్‌మీడియాను వినియోగించుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో ఆడియో క్లిప్పింగ్‌ను గ్రామ సోషల్‌ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. ‘గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నపం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి. ఒత్తిడి లేని విద్య. మీ డబ్బులు మీ దగ్గరే.. పిల్లల భవిష్యత్‌ మా వద్ద. ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్‌. ఉచితంగా పాఠ్యపుస్తకాలు. క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణింపు. అడ్మిషన్‌ ఫీజు లేదు. అమ్మలు పిల్లలకు క్యారేజ్‌ పెట్టనవసరం లేదు. మధ్యాహ్న భోజన వసతి..’ అంటూ ఏఐతో చెప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు.

దోపిడీ ఉన్నంతకాలం పోరాటాలుంటాయి

వేములవాడఅర్బన్‌: సమాజంలో దోపిడీ ఉ న్నంత కాలం కమ్యూనిస్టు పోరాటాలు ఉంటాయని జనగాం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజారెడ్డి అన్నారు. వేములవాడలో సీపీఐ శిక్షణ శిబిరం రెండో రోజు శనివారం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. చెన్న విశ్వనాథం, గోషిక మోహన్‌, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఉమా మహేశ్‌, పంజాల శ్రీనివాస్‌, సదానందం, మంద సుదర్శన్‌, కడారి రాములు ఉన్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

సిరిసిల్లటౌన్‌: విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ కోరారు. స్థానిక బతుకమ్మ ఘాట్‌లో స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం సమ్మర్‌ క్యాంపు ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించేలా, క్రీడాకారులలో నైపుణ్యాన్ని పెంపొందించేలా బతుకమ్మ ఘాట్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ నిర్వాహకులు కృషి చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌, గోక శ్రీనివాస్‌, బండారి శివ, సుష్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement