వేములవాడ: వేములవాడ భీమేశ్వరస్వామిని సోమవారం 75 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు వివిధ మొక్కులను పెద్ద ఎత్తున చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణాలు 180, సత్యనారాయణ వ్రతాలు 10, మహా రుద్రాభిషేకాలు 111, వాహన పూజలు 2, పెద్ద సేవలు 6, కుంకుమ పూజలు 10, చండీ హోమాలు 2, కోడె మొక్కులు 4,338, గండదీపాలు 1,325, శీఘ్ర దర్శనం 2,592, అతి శీఘ్ర దర్శనం 660, కోడె మొక్కులు 760 చెల్లించుకున్నారు. భక్తుల ద్వా రూ.80 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.


