ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా ‘ఆగస్త్య ఫుడ్స్’ కంపెనీ ‘సూపర్ ఫుడ్స్’ యూనిట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 130 మందికి ఉపాధి కల్పిస్తూ ఆగస్త్య కంపెనీ ‘సూపర్ ఫుడ్స్’ తయారు చేస్తూ ఎగుమతి చేస్తుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేశారు. వివిధ పంటలను రైతులు పండించేలా అవి ఇక్కడే ప్రాసెస్ అయి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తొలియూనిట్ ఈ ఏడాది పని ప్రారంభించింది.


