చలిలో బయట తిరగకూడదు
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు చలిలో తిరగకూడదు. అత్యవసరమై బయటకు పోవాలంటే ఉన్నిదుస్తులు తప్పకుండా ధరించాలి. ఫ్రిజ్‌లోని చల్లని నీరు, ఆహార పదార్థాలు సేవించకూడదు. ఫిల్టర్ చేసిన మంచినీటిని సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న వాటినే సేవించాలి. ఉదయం స్నానం చేశాక వెంటనే, రాత్రి పడుకునే ముందు శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్స్ పూసుకోవడం మంచిది. మంచు కురిసే సమయంలో ముక్కు, చెవులు కప్పేలా ఉన్ని మఫ్లర్ లేదా కాటన్ వస్త్రాన్ని చుట్టుకోవాలి. చేతులకు గ్లౌజులు తొడుక్కోవాలి. ఆస్తమా పేషెంట్లు ముందస్తుగానే మందులను ఉంచుకోవాలి. వైద్యుల సలహాలు, పర్యవేక్షణలో మందులు వాడటం మంచిది. సూర్యోదయం తర్వాతే వాకింగ్ చేయడం మంచిది.
– డాక్టర్ సంతోష్‌కుమార్,
డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లాసుపత్రి. సిరిసిల్ల


