సిరిసిల్లటౌన్: ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. సోమవారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో జరిగిన ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి మంద అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆదిత్య, బండి ప్రణయ్, తాలూక శివసాయి తదితరులు పాల్గొన్నారు.
రంగవల్లి స్మారకోపాన్యాసాల సభ వాయిదా
వేములవాడఅర్బన్: వేములవాడ నందికమాన్ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరగాల్సిన రంగవల్లి ప్రఽథమ వార్షికోత్సవ సభ అందెశ్రీ మరణం వల్ల ఈనెల 13కు వాయిదా వేసినట్లు విమలక్క సాయికుమార్ తెలిపారు. 13న జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.
నేడు సిరిసిల్లలో మినీ జాబ్ మేళా
సిరిసిల్లటౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకై మంగళవారం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ నీలం రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.10,000ల నుంచి రూ.20,000 వరకు వేతనం ఉంటుందని అన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ, యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో తమ కార్యాలయంలో జరుగు మినీ జాబ్ మేళాకు హాజరుకావాల్సిందిగా కోరారు.
జర్మనీ వ్యవసాయ సదస్సుకు కోనరావుపేట రైతులు
కోనరావుపేట: కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ సదస్సు కోసం సోమవారం జర్మనీ వెళ్లారు. జర్మనీకి చెందిన ఫ్రొన్‌హోపర్ సంస్థ నిర్వహించే సదస్సుకు మామిడిపల్లికి చెందిన కాతుబండ శ్రీనివాస్, కాటిపెల్లి వేణు, నాగారంకు చెందిన దుంపెట నాగరాజు ఎంపికయ్యారు. అక్రాట్ ప్రాజెక్ట్ ఇండియాలో భాగంగా నూతన టెక్నాలజీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధానంలో ప్రతిభ కనబర్చిన ఈ రైతులను ఎంపిక చేశారు. ఈ మేరకు ముగ్గురు రైతులు సోమవారం బయలుదేరి వెళ్లారు.
హామీలు అమలు చేయాలి


