అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
ప్రజావాణిలో 86 దరఖాస్తులు స్వీకరణ
సిరిసిల్లఅర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. క లెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. మొత్తం 86 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, సకాలంలో పరిష్కరించాలని అధికారులను సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె ఎల్లమ్మ గుడి ఆవరణంలో పందులు తీరుగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. పందుల యజమాని, కార్యదర్శికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. గుడి వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చర్యలు తీసుకొని పందుల బారి నుంచి కాపాడాలి.
– గౌడ సంఘం నాయకులు, గోపాల్‌రావుపల్లె
నా భర్త తోట శ్రీనివాస్ ఉపాధి కోసం మలేషియా దేశం వెళ్లి అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు రిష్విత వికలాంగురాలు. కదలలేని స్థితిలో ఉంది. వారి పోషణ భారంగా మారింది. పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– తోట జయశ్రీ, శివనగర్, సిరిసిల్ల
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో 48 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. అందులో మరుగు దొడ్లు, తాగునీటి వసతి, డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ పనులు చేయడం లేదు. త్వరగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. – గూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు
మాది సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరు. నా భర్త నర్ర బుచ్చయ్య ఐదు నెలల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం కుటుంబపోషణ భారంగా ఉంది. భర్తకు వచ్చే పెన్షన్ నాకు ఇప్పించి ఆదుకోవాలి.
– నర్ర సుగుణవ్వ, పెద్దూరు
మధ్యమానేరు ప్రాజెక్టులో 10 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎఫ్‌టీఎల్ 318 వరకు భూసేకరణ చేశారు. ప్రస్తుతం 318 దాటి మరో 50 మీటర్ల వరకు నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా పంట పొలాల్లోకి నీరు వచ్చింది. చర్యలు తీసుకొని పంట చేనుల్లోకి నీరు రాకుండా చూడాలి. – అనుపురం రైతులు
అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
అర్జీలను గడువులోగా పరిష్కరించాలి


