రోడ్డు పనులు పూర్తి చేయాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై తాత్కాలికంగా నిర్మిస్తున్న మట్టి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం సిద్దిపేట, కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వాగులో నుంచి నడిచి రావాల్సి వస్తోందని, మరోవైపు మానేరు క్యాంపు వద్ద నుంచి దూర ప్రయాణం చేసి వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థుల చదువులకు నష్టం జరుగకుండా చూడాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ మారుతిరెడ్డి అక్కడి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి నాలుగు రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా చూస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా నాయకులు రాజు, గొండ్లె తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.


