కత్తుల కలకలం
జిల్లాలో వరుస ఘటనలతో కలవరం
ఇటీవల సిరిసిల్లలో రియల్టర్ హత్య
వేములవాడలో ఇరువురిపై దాడి
తెరపైకి మాజీ నేరస్తులు
జిల్లాలో రియల్టర్‌గా పేరొందిన సిరిగిరి రమేశ్‌ను ఇటీవల సిరిసిల్ల శివారులో అతడితోపాటు వ్యాపారం చేసే భాగస్వాములు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి వేములవాడ నందికమాన్ వద్ద కారులో ఉంచడం, నిందితులే రమేశ్ అంత్యక్రియల్లో పాల్గొనడం గమనార్హం. రమేశ్‌ను హత్య చేసింది అతడితో ఏళ్ల కాలంగా వ్యాపారం చేసిన వారే అని పోలీసుల దర్యాప్తులో తేలడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో నిందితులందరినీ పోలీసులు కటకటాలకు పంపారు.
వేములవాడలోని కోరుట్ల బస్టాండ్ ఏరియాలో కొందరు వ్యక్తులు మరో వ్యక్తికి చెందిన బైక్‌ను దాచిపెట్టారు. రాత్రి సమయంలో తన బైక్ కనపించకపోవడంతో వాహనదారు కంగారుపడి పరిసర ప్రాంతాల్లో వెతుకుతూ అక్కడే ఉన్నవారితో బైక్ విషయమై వారించాడు. ఈక్రమంలో అక్కడున్న వారిలో కొందరు వాహనదారును కత్తితో పొడిచారు. పోలీసులు ఘటన స్థలానికి చేసుకుని దర్యాప్తు చేయగా, యువకులు గంజాయి మత్తులో దాడి చేసినట్లు తేలింది.
సిరిసిల్లక్రైం: జిల్లాలో కత్తిపోట్ల సంస్కృతి కలకలం రేపుతోంది. రెండునెలల్లో సిరిసిల్ల, వేములవాడలో రెండు కత్తి దాడులు, బీర్‌బాటిల్ దాడులతో జనం ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో రియల్టర్‌ను హత్య చేయగా, వేములవాడలో ఇద్దరిపై దుండగులు దాడి చేశారు. పాత కక్షలతో పాటు గంజాయి మత్తులో దాడులు జరగడం కలవరపెడుతోంది. పోలీసులు నిఘా మరింత పటిష్టం చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదనే చర్చ జోరందుకుంది.
స్వల్ప వ్యవధిలో నాలుగు ఘటనలు
జిల్లాలో సెప్టెంబర్ చివరివారం, అక్టోబర్ ప్రారంభంలో వరుసగా పలువురిపై దాడులు జరిగాయి. పాత కక్షలతో రియల్టర్ రమేశ్‌ను అతడి డ్రైవర్ సాయంతో మరో ఇద్దరు కలిసి కత్తితో హత్య చేశారు. వేములవాడలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువకుడిని గంజాయి మత్తులో కొందరు బీరు బాటిల్స్‌తో తలపై దాడి చేయగా, స్థానికులు గమనించి అరవడంతో దాడి చేసినవారు పారిపోయినట్లు సమాచారం. ఇది మరువక ముందే మళ్లీ వేములవాడలోని కోరుట్ల బస్టాండ్ ఏరియాలో గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు ఓ ద్విచక్ర వాహనదారును కత్తితో పొడిచారు. క్షతగాత్రుడు ఇప్పటికీ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఈనెల 1న సిరిసిల్లలో పలువురు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకుని స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇలా.. జిల్లాలో కత్తిదాడులు సాధారణమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్షణికావేశంలో..
ప్రస్తుతం మద్యం, గంజాయి మత్తులో మాటామాటా పెరిగి దాడులు జరుతున్నాయి. క్షణికావేశంలో విలువైన జీవితం నాశనం చేసుకుంటున్నారు. పాత కక్షలతో పలువురు దాడులు చేసి చట్టపరిధి దాటుతున్నారని పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, మరోవైపు గంజాయి మత్తులో జరుగుతున్న చిన్నచిన్న దాడులు పోలీసులకు తలనొప్పిగా మారినట్లు ఖాకీల్లో చర్చ జరుగుతోంది. వీటిని ఆపేందుకు నిరంతర గస్తీ, నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
హత్యలు, దాడుల నియంత్రణకు..
కత్తుల కలకలం
కత్తుల కలకలం


