శివయ్యకు మొక్కులు
వేములవాడ: కార్తీకమాసం సందర్భంగా ఆది వారం వేములవాడ రాజన్న, భీమన్న, నగరేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారలకు మొక్కులు చెల్లించుకున్నారు.
‘108’ డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు
ముస్తాబాద్(సిరిసిల్ల): అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్ పైలట్లకు అవార్డులు వరించాయి. డీఎంహెచ్‌వో రజిత చేతుల మీదుగా ముస్తాబాద్ 108 పైలట్లు కిషన్, వెంకటేశ్ ఆదివారం ఉత్తమ డ్రైవర్లుగా అవార్డులు అందుకున్నారు. 108 అంబులెన్స్‌లో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న వీరు వందలాది మంది ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర వహించారు. ఎంతో మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు నిలిపారని డీఎంహెచ్‌వో కొనియాడారు. 108 జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ జనార్ధన్ తదితరులు అభినందించారు.
హామీలు అమలు చేయాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. తెలంగాణ సాధనలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారన్నారు. వారి త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో పోరాడినవారంతా కనుమరుగయ్యారని, ఉద్యమం చేయనివారు భోగాలు అనుభవిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, ప్రతీ ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం, ప్రభుత్వ పథకాల్లో 20శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే భవిష్యత్ పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఫోరం జిల్లా అధ్యక్షుడిగా వెంగళ శ్రీనివాస్‌ను నియమించారు. టీయూఎఫ్ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు పోతూ జ్యోతిరెడ్డి, జగన్‌యాదవ్, గుజ్జే దత్తాద్రి, కందుకూరి రామాగౌడ్, కొక్కుల ఆంజనేయులు, కొమ్మరాజుల ఐలయ్య, భాస్కర్, పటోళ్ల సురేందర్‌రెడ్డి, జానకిరెడ్డి, వీరస్వామి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి
పోటీలకు ఎంపిక
వేములవాడ: మహబూబాబాద్ జిల్లా నెల్లి కోదూర్‌లో ఆదివారం జరిగిన 69వ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్–14 బాలికల విభాగంలో వేములవాడకు చెందిన బయానా ఆనందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ డీ శ్రీనివాస్, అభిషేక్, కరీంనగర్ జిల్లా ఆర్చరీ సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ బింగి మహేశ్, పలువురు ఆనందినిని అభినందించారు.
4న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
సిరిసిల్లటౌన్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 4న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు సాంఘిక సంక్షేమ గురుకులం జిల్లా కో ఆర్డినేటర్ జే.జే థెరిస్సా ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఆకస్మిక వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాలతో వాయిదా పడిందన్నారు. మళ్లీ 4న ఉదయం 10 గంటలకు చిన్నబోనాల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
శివయ్యకు మొక్కులు
శివయ్యకు మొక్కులు
శివయ్యకు మొక్కులు


