ముందుకు సాగని విస్తరణ పనులు
వేములవాడ: పట్టణంలో 80 ఫీట్ల రోడ్ల విస్తరణ కోసం చేపట్టిన పనులకు మోక్షం లభించడం లేదు. జూన్ 15న ప్రారంభించిన రోడ్ల వెడల్పు ప్రక్రియ ఇంకా ఆరంభంకాలేదు. ఇప్పటికే పాత భవనాల కూల్చివేత పూర్తికాగా మూడు భవనాలు మినహా కూల్చివేతలు దాదాపు పూర్తయ్యాయి. నిర్వాసితులకు రూ.47 కోట్ల నష్టపరిహారం సైతం చెల్లింపులు దాదాపు పూర్తయ్యాయి. రోడ్ల వెడల్పునకు రూ.6.50 కోట్లతో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇతర అఽధికారులు భూమిపూజ చేశారు. అయినా ఇంకా పనులు ముందుకుసాగడం లేదు.
కోర్టు పరిధిలో మూడు భవనాలు
మూలవాగు బ్రిడ్జినుంచి రాజన్న ఆలయం వరకు చే పట్టే 80 ఫీట్ల రోడ్ల వెడల్పులో భాగంగా మరో మూ డు భవనాలు కోర్టు పరిధిలో ఉండటంతో వందశా తం కూల్చివేతలు పూర్తికాలేదు. మిగతా ప్రాంతాల్లో పనులు చేసుకునే సౌకర్యం ఉన్నా అధికారులు పనులు చేపట్టడంలేదని ప్రజలు వాపోతున్నారు.
ఎక్కడి శిథిలాలు అక్కడే
వేములవాడ మెయిన్ రోడ్డు పనులు కొనసాగకపోవడంతో దారి వెంట ఎక్కడి శిథిలాలు అక్కడే ఉన్నాయి. ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్‌లు, శిథిలాల్లోనే తాత్కాలిక దుకాణాలు కొనసాగుతుండగా భక్తులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. జూన్ 15నుంచి ఇప్పటివరకు మెయిన్‌రోడ్డు ప్రాంతంలోని ప్రజలకు వీధి దీపాలు, డ్రైనేజీలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సమస్యతోపాటు మెయిన్ రోడ్డపై అంధకారం నెలకొంటుంది.
వ్యాపారుల ఆందోళన
రోడ్ల వెడల్పు అనంతరం మెయిన్ రోడ్డు చీకట్లు కమ్ముకున్నాయని, రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా మారడంతో దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌కు వ్యాపారాలు సాగడం లేదని, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
త్వరగా పూర్తిచేయాలి
ఎన్నో ఏళ్ల కల సాకారమైందని సంబురపడ్డాం. కానీ ఇంకా పనులు ప్రారంభించడం లేదు. త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అధికార యంత్రాంగం దృష్టిసారించాలి.
–దుర్గం పర్శరాం, వేములవాడ
విస్తరణ పనులు ప్రారంభిస్తాం
రోడ్ల విస్తరణకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తున్నాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. కూల్చివేతలకు సంబంధించి మూడు భవనా లను వదిలిపెట్టి మిగతా ప్రాంతాల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తాం.
– అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ
ముందుకు సాగని విస్తరణ పనులు
ముందుకు సాగని విస్తరణ పనులు


