నిధులు మంజూరు చేయాలి
ఎల్లారెడ్డిపేట గిద్దెచెరువు సుందరీకరణకు గత ప్రభుత్వం రూ.3కోట్ల అంచనాలతో నిధులు మంజూరు చేసింది. నిధులు సరిపోక కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించాలి.
– బందారపు బాల్‌రెడ్డి, ఎల్లారెడ్డిపేట
మిగిలిన పనులు పూర్తి చేస్తాం
జిల్లాలో మినీట్యాంక్‌బండ్‌గా మార్చడానికి ఎంపిక చేసిన చెరువులను పరిశీలించి, పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. గతంలో మంజూరైన నిధులు ఖర్చు చేసి పనులు చేపట్టాం. మిగిలిన పనులకు నిధుల అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తాం.
– సత్యనారాయణ, నీటిపారుదలశాఖ, డీఈ


