
వేగంగా ఆలయ అభివృద్ధి పనులు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులకు మోక్షం లభిస్తోంది. గుడి చెరువు ఖాళీ స్థలంలో ప నులు జరిగే ప్రాంతానికి జనాలు రాకుండా బౌండ రీ ఏర్పాటు చేస్తున్నారు. కోడెల క్యూలైన్లను తొలగించి వాటి స్థానంలో అభివృద్ధి పనులకు మంగళవారం జేసీబీలతో మట్టి తీస్తున్నారు. భీమన్న గుడి ముందున్న వేద పాఠశాల భవనంలోకి ప్రసాదాల తయారీ కేంద్రాన్ని మార్చబోతున్నారు. కాగా, ఈనె ల 19న శృంగేరిపీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థానంద స్వామిజీ రాజన్న ఆలయానికి రానున్నట్లు విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అనంతరం భీమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు. కా గా, ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారా మయ్యర్ వేములవాడకు రానున్నట్లు అధికారులు తెలిపారు.
పీఆర్వో కార్యాలయ భవనంలోకి నిత్య నివేదనశాల
రాజన్న ఆలయ ఆవరణలోని రాజేశ్వరపురం వసతి గదుల వద్దనున్న ప్రధాన గెస్ట్‌హౌస్‌లోని నాలుగు వీఐపీ గదుల్లో ఇప్పటి వరకు పీఆర్‌వో కార్యాలయం కొనసాగింది. ప్రస్తుతం ఈ గెస్ట్‌హౌస్‌లోకి శ్రీస్వామి వారి నిత్యనివేదనశాల ఏర్పాటు చేసేందుకు మంగళవారం సన్నాహాలు చేపట్టారు.