
ముస్కానిపేట డాలర్ల పంట
– వివరాలు 10లో..
ఇల్లంతకుంట(మానకొండూర్): మెట్టప్రాంతం.. వర్షం కొడితేనే పంటలు.. లేకుంటే భూములు బీళ్లు. మదినిండా కష్టాలు.. కంటినిండా కన్నీళ్లు.. ఇవన్నీ దూరం కావాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారు. ఉన్నత చదువులతో కష్టాలను అధిగమించారు. విదేశాలకు వెళ్లి డాలర్ల పంట పండిస్తున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌లుగా ఉద్యోగం చేస్తూ ఊరిని కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. కుగ్రామం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేట యువత విద్యతోనే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. వివిధ దేశాల్లో 34 మంది సాఫ్ట్‌వేర్లుగా పనిచేస్తుండగా.. ఊరిలోనే 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్యతో ఊరి రాతనే మార్చుకున్న పల్లె యువత విజయగాథ ఈవారం సండే స్పెషల్.
నా కొడుకు రాకేశ్‌రెడ్డి 2011లో పూర్తిచేశాడు. చదువు పూర్తికాగానే కాలేజీ క్యాంపస్‌లో ఎంపికై టీసీఎస్‌లో ఉద్యోగం పొందాడు. 2021లో కంపెనీనే అమెరికాకు పంపింది. చిన్న కొడుకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. – సామ సత్యనారాయణరెడ్డి
ముస్కానిపేట గ్రామ కమాన్

ముస్కానిపేట డాలర్ల పంట