
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో వేములవాడ లయన్స్‌క్లబ్, సన్‌రైజర్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించి ఉచిత వైద్యశిబిరాన్ని ఆదివారం వైద్యులతో కలిసి ప్రారంభించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే కృతనిశ్చయంతో లయన్స్‌క్లబ్ ఉందన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారన్నారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ చీకోటి సంతోష్, సెక్రటరీ బచ్చు వంశీకృష్ణ, ట్రెజరర్ కోయినేని ప్రవీణ్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్, వైద్యులు కోయినేని రాజేందర్, నామాల ప్రదీప్, ఆనందరెడ్డి, సన్స్‌రైజర్స్ వైద్యులు కొండపాక కిరణ్‌కుమార్, ఉదయ్, నిర్వాహకులు సాయికుమార్, ప్రసాద్ పాల్గొన్నారు.
పోరాటాలకు సిద్ధం కావాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు కోరారు. తంగళ్లపల్లిలోని ఫ్రెండ్స్‌క్లబ్‌లో ఆదివారం తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. ముందుగా ర్యాలీ తీసి, ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన బస్వాపూర్‌కు చెందిన పంచాయతీ కార్మికుడు దాచారం భూమయ్య చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ముత్యంరావు మాట్లాడుతూ జీపీ సిబ్బందికి భారంగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కోరారు. నాయకులు మల్యాల నర్సయ్య, ఎగమంటి ఎల్లారెడ్డి, మూషం రమేశ్, సూరం పద్మ, జవ్వాజి విమల, కంసాని రవి, నేరెళ్ల రాజు, అశోక్, కిరణ్ పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం
30 మందితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కోడం రమణ, జిల్లా అధ్యక్షుడిగా బుర్ర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల నర్సయ్య, ఉపాధ్యక్షులుగా అన్నల్‌దాస్ గణేశ్, వర్కోలు మల్లయ్య, అక్కల అంజయ్య, లోకిని శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా నారాపురం నర్సయ్య, సందెల మహేశ్, మామిడి నరేశ్ ఏకగ్రీవమయ్యారు.
రాజన్నా శరణు..శరణు
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి మూలవాగు, మానేరువాగుల్లోంచి 400 క్యూసెక్కుల మేర వరద ఇన్‌ఫ్లోగా చేరుతోంది. మిడ్‌మానేరులో నీటిమట్టం 27.171 టీఎంసీలకు చేరింది.

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం