
బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్రతో ముందుకెళ్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆరోపించారు. సిరిసిల్లలోని తన నివాసంలో ఆదివారం ప్రెస్‌మీట్లో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను క్షమించబోరన్నారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10 శాతం ఎందుకని కేంద్రమంత్రి బండి సంజయ్ మొదట్లోనే ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరిపైనా నిరసనలు తెలుపుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే రిజర్వేషన్ ప్రకారం మంత్రివర్గంలో 8 మంది బీసీలు ఉండాలన్నారు. బీసీ మంత్రుల స్థానాల కోసం ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేయగలరా అని సవాల్ విసిరారు. బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ ఇంటిపైకి పోలీసులను పంపడాన్ని సమర్థిసున్నారా అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మ్యాన రాంప్రసాద్, చొప్పదండి శ్రీనివాస్ పాల్గొన్నారు.