
నడుచుకుంటూ పోవచ్చు
కొచ్చగుట్టతండా నుంచి రుద్రంగికి దుర్గమ్మ దారి నుంచి నడుచుకుంటూ పోవచ్చు. ఆ దారిని కాదని అంబారిపేట నుంచి పోవాలంటే చుట్టూ తిరగాల్సిందే. దుర్గమ్మ గుడి ముందు నుంచి రోడ్డును బాగుచేసి ఒర్రైపెన బ్రిడ్జి కట్టాలే.
– గుగులోతు గౌరి, కొచ్చగుట్టతండా
గుడి ముందు తోవనే..
కొచ్చగుట్టతండా నుంచి రుద్రంగి వచ్చేందుకు ఇప్పుడు ఉన్న తోవ సూరమ్మ చెరువులో మునిగిపోతే దుర్గమ్మగుడి ముందు నుంచి పోయే తోవనే మంచిగా ఉంటుంది. కొచ్చగుట్టతండా నుంచి దుర్గమ్మగుడి వరకు అర కిలోమీటరు తారు రోడ్డు వేసి, ఒర్రె మీద బ్రిడ్జి నిర్మిస్తే సరిపోతది.
– గుగులోతు గోపాల్, కొచ్చగుట్టతండా
అంబారిపేట నుంచే రావాలి
కొచ్చగుట్టతండా దారి సూరమ్మ ప్రాజెక్టులో ముంపునకు గురైతే కొచ్చగుట్టతండా ప్రజలు అంబారిపేట నుంచే రుద్రంగికి రావాలి. మరే తోవ మా ప్రపోజల్‌లో లేదు. కొచ్చగుట్టతండాకు మంజూరైన రూ.1.30 కోట్లు దుర్వినియోగం కాలేదు. కొచ్చగుట్టతండా వద్ద అంబారిపేట రోడ్డుకు లింకు పనులు చేపట్టాం.
– సిరిమల్ల మాధురి,
ఏఈఈ, ట్రైబల్ వెల్ఫేర్, రుద్రంగి

నడుచుకుంటూ పోవచ్చు