
లిక్కర్ టెండర్‌కు మరో చాన్స్
● 23 వరకు గడువు పొడగింపు ● ఇప్పటి వరకు 1,324 దరఖాస్తులు ● రూ.కోటి తగ్గిన ఆదాయం ● జిల్లాలో 48 మద్యం దుకాణాలు
సిరిసిల్లక్రైం: మద్యం టెండర్లు వేసేందుకు మరో అవకాశం దక్కింది. ఈనెల 23 వరకు లిక్కర్ టెండర్లకు గడువు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 మద్యం దుకాణాలకు 1324 దరఖాస్తులు రాగా.. రూ.39.72కోట్ల ఆదాయం సమకూరింది. శనివారంతో గడువు ముగిసిపోగా.. ప్రభుత్వం 23వ తేదీ వరకు పొడగించింది.
48 షాపులు.. 1,324 దరఖాస్తులు
జిల్లాలో మొత్తం 48 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 1,324 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున ఫీజు చెల్లించగా, గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షలతో 2,036 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మొత్తంలో తగ్గుదల కనిపించింది. మరో 712 దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది. వీటితో రాష్ట్ర ఖజానాకు రూ.39.72కోట్లు వచ్చాయి. కానీ గత టెండర్లలో వచ్చిన ఆదాయంతో పోల్చితే రూ.కోటి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఖజానా టార్గెట్ రూ.కోటి
గతంలో కంటే దరఖాస్తుదారులు తగ్గడానికి దరఖాస్తు ఫీజు పెంచడమేనని ముందు నుంచి అందరిలో చర్చ ఉంది. అయితే కనీసం గత టెండర్‌లో వచ్చిన ఫీజులు వచ్చిన బాగుండేదని ఆబ్కారీ అధికారులు ముచ్చటించిన సందర్భాలు ఉన్నాయి. తక్కువగా వచ్చిన రూ.కోటి టార్గెట్‌గా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఎకై ్సజ్ శాఖ ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి దరఖాస్తు చేసుకునే గడువును పొడగించారు. ఈనెల 23వ తేదీ వరకు టెండర్ వేయడానికి అవకాశం ఇచ్చి.. ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గతంలోని టెండర్ల వివరాలు
దరఖాస్తులు : 2,036 ఫీజు : రూ.2 లక్షలు ఆదాయం : రూ.40.72 కోట్లు