
కొచ్చగుట్టతండాకు దూరభారమేనా !
ఇదీ 2 కిలోమీటర్లే..
ఇది అంబారిపేట, కొచ్చగుట్టతండాల నుంచి పంటపొలాల మీదుగా.. దుర్గమ్మ ఆలయం ముందు నుంచి రుద్రంగికి చేరుకునే దారి. ఒక కిలోమీటరు దూరం గల ఈ రోడ్డుపై తారు వేసి, దుర్గమ్మ ఆలయం వద్ద గల ఒర్రైపె బ్రిడ్జి నిర్మిస్తే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రంగికి చేరుకుంటారు. ఈ రోడ్డును బాగుచేయాలని రెండుతండాల ప్రజలు కోరుతున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఈ రోడ్డు 10 కిలోమీటర్లు
ఇది కొచ్చగుట్ట, అంబారిపేటతండాల నుంచి అంబారిపేటకు వెళ్లేందుకు వేస్తున్న దారి. ఈ దారి గుండానే రెండు తండాల ప్రజలు అంబారిపేట మీదుగా రుద్రంగి మండల కేంద్రానికి చేరుకోవాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇలా రుద్రంగికి రావాలంటే గిరిజనులకు 10 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి ఉంటుంది. దూరభారంతోపాటు సమయం కూడా వృథా అవుతుంది.

కొచ్చగుట్టతండాకు దూరభారమేనా !