శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి

Oct 18 2025 9:49 AM | Updated on Oct 18 2025 9:49 AM

శుద్ధ

శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి

శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి ● అదనపు కలెక్టర్‌ నగేశ్‌ పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి రోజంతా బంద్‌ పాటించాలి రసమయి దిష్టిబొమ్మ దహనం

● అదనపు కలెక్టర్‌ నగేశ్‌

సిరిసిల్ల: 17 శాతంలోపు తేమ ఉన్న శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం సేకరణపై ఐకేపీ సెంటర్ల ఇన్‌చార్జీలకు కలెక్టరేట్‌లో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల బాధ్యులు నిబంధనల ప్రకారం తేమ శాతం చేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఏ–గ్రేడ్‌ క్వింటాలుకు రూ.2,389, కామన్‌ రకానికి రూ.2,369గా ప్రభుత్వం నిర్ణయించిందని, సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్‌ రూ.500 ఇస్తుందని వివరించారు. కేంద్రంలో విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవాలని, రైతులకు షామియానా, నీటి సదుపాయం కల్పించాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, డీసీఎస్‌వో చంద్రప్రకాశ్‌, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ఏక మొత్తంలో చెల్లించాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రేవా జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం హెచ్చరించారు. కలెక్టరేట్‌ వద్ద రేవా ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 2024 మార్చి నుంచి ఇప్ప టి వరకు జీపీఎఫ్‌, జీఐఎస్‌, ఫైనల్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, గ్రాట్యుటీ అందలేదన్నారు. రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, నాయకులు ప్రభాకర్‌, దివాకర్‌, రాములు, పరమేశ్‌, ధర్మయ్య, సుధాకర్‌, వెంకటయ్య, మద్దికుంట లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల/సిరిసిల్లటౌన్‌: బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టే బంద్‌ను రోజంతా పాటించాలని బీసీ జేఏసీ ప్రతినిధి, సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు కోరారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరు లతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌కు పిలుపు ఇచ్చామని పేర్కొన్నారు.

చట్టాలు తెలియాలి

సిరిసిల్లటౌన్‌: కార్మికులకు చట్టాలు తెలియాలని సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఏ.ఖదీర్‌పాషా కోరారు. కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ‘అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు న్యాయ సేవలు’ కా ర్యక్రమం నిర్వహించారు. మానేరు స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ చింతోజు భాస్కర్‌, రిటైర్డ్‌ లేబర్‌ ఆఫీసర్‌ బలరాం తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ దిష్టిబొమ్మను శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవ రణలో కాంగ్రెస్‌ నాయకులు దహనం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను రసమయి దుర్భాషలాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగిరి వినయ్‌కుమార్‌, జమాల్‌, కరుణాకర్‌రెడ్డి, రాజేశం, బడుగు లింగం, జెట్టి మల్లేశం పాల్గొన్నారు.

ఫామ్‌హౌస్‌ ముట్టడి

బెజ్జంకి మండలంలోని రసమయి ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్‌ నాయకులు ముట్టడించేందుకు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్‌రెడ్డి, తీగల పుష్పలత, వెలిశాల జ్యోతి, పసుల వెంకటి, ఎలగందుల ప్రసాద్‌, వీరేశం, సత్యారెడ్డి, సురేందర్‌రెడ్డి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఉన్నారు. వీరిని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు.

శుద్ధిచేసిన వడ్లను   కొనుగోలు చేయాలి
1
1/4

శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి

శుద్ధిచేసిన వడ్లను   కొనుగోలు చేయాలి
2
2/4

శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి

శుద్ధిచేసిన వడ్లను   కొనుగోలు చేయాలి
3
3/4

శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి

శుద్ధిచేసిన వడ్లను   కొనుగోలు చేయాలి
4
4/4

శుద్ధిచేసిన వడ్లను కొనుగోలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement