
ఒక్క రోజే 300 దరఖాస్తులు
● ఊపందుకున్న మద్యం అప్లికేషన్లు ● నేటితో ముగియనున్న గడువు
సిరిసిల్ల క్రైం: జిల్లాలోని మద్యం దుకాణాలకు శుక్రవారం ఒక్క రోజే 300 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులతో కలెక్టరేట్‌లోని ఎకై ్సజ్ ఆఫీస్ రద్దీగా మారింది. ఇప్పటి వరకు 48 వైన్‌షాపులకు 852 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18వ తేదీతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనుంది. పది లోపు దరఖాస్తులు వచ్చిన దుకాణాలు పాతికకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చినవి 5 దుకాణాలు ఉండగా, రెండు దరఖాస్తులు వచ్చినవి 6, అసలు దరఖాస్తులు రానివి 2 దుకాణాలు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కొన్ని మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు(సింగిల్ టెండర్) మాత్రమే రావడం, మరికొన్ని షాపులకు దరఖాస్తులు పడకపోవడంపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దరఖాస్తుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.