పెండింగ్‌ పనులు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

Oct 19 2025 6:31 AM | Updated on Oct 19 2025 6:31 AM

పెండి

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సాంకేతిక వ్యవసాయంపై అవగాహన ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయాలి ● జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత కొనుగోళ్లు వేగవంతంగా పూర్తి చేయాలి నిబంధనల ప్రకారం టపాసులు విక్రయించాలి ● జిల్లా ఫైర్‌ అధికారి నరేందర్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ: నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ అధికా రులతో శనివారం సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు, పలు పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలోని రోడ్లు, ఇప్పటికీ ప్రారంభించని పనులు, సీఆర్‌ఆర్‌, ఎమ్మారార్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఈలు సుదర్శన్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, డీఈలు పవనకుమారి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు.

కోనరావుపేట(మానకొండూర్‌): మండలంలోని నాగారంలో సిరిసిల్ల అగ్రికల్చర్‌ కళాశాల విద్యార్థులు స్థానిక రైతులకు సాంకేతిక జ్ఞానాన్ని చేరవేయాలనే లక్ష్యంతో శనివారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. వాతావరణ కేంద్రం ఐ–ట్రాపర్‌ పరికరాల వినియోగం, వాటి ప్రాముఖ్యతను వివరించారు. వాతావరణ మార్పులు, పురుగుల దాడులు.. నివారణపై అవగాహన కల్పించారు. ఐ–ట్రాపర్‌ వినియోగం ద్వారా పంటలకు హానికరమైన పురుగులను ముందుగానే గుర్తించి నియంత్రించడం ద్వారా పంట నష్టం తగ్గించుకోవచ్చన్నారు. వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ విలాకర్‌, అక్రాట్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ దుంపేటి నాగరాజు, మ్యాకల ప్రకాశ్‌, బొమ్మెన కిషన్‌రావు, బాస రామచంద్రం, మ్యాకల స్వామి పాల్గొన్నారు.

సిరిసిల్ల: ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత కోరారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్న తీరును పరిశీలించారు. రజిత మాట్లాడుతూ వ్యాక్సిన్లను నిల్వ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు సైతం విధిగా తమ పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు. డాక్టర్‌ సాహితీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లు వేగవంగా పూర్తి చేయాలని ఐకేపీ కొనుగోళ్ల మండల ప్రత్యేకాధికారి లింగంగౌడ్‌ పేర్కొన్నారు. మండలంలోని రాగట్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కేంద్రంలోని రికార్డులు, కొనుగోళ్ల వివరాలు, రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఏపీఎం నర్సయ్య, నిర్వాహకులు ఉన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిబంధనలకు లోబడి టపాసుల నిర్వాహకులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఫైర్‌ అధికారి నరేందర్‌ సూచించారు. మండలంలోని రాచర్లగొల్లపల్లి, ఎల్లారెడ్డిపేటల్లో శనివారం టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా టపాసులను డంప్‌ చేసి జనావాసాల మధ్య విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి
1
1/3

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి
2
2/3

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి
3
3/3

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement