
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరిత
● శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ మహేశ్ బీ గీతే అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్‌గా ఎం.హరిత సోమవారం విధుల్లో చేరారు. కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ ఆలయ ఈవో రమాదేవి ఆ ధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కలెక్టర్‌కు ఆశీర్వాదం, రాజన్న ప్రసాదం అందించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా క లిసి పుష్పగుచ్ఛాలు అందించారు. అలాగే కలెక్టర్‌ను జిల్లా టీఎన్జీవోఎస్ ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు జయంత్‌కుమార్, ఏఎస్‌వో జిల్లా అధ్యక్షుడు సుమన్, ఏఈఓఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
పుష్పగుచ్ఛం అందజేత
సిరిసిల్ల క్రైం/సిరిసిల్లఅర్బన్: కలెక్టర్‌గా హరిత బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మహేశ్ బీగీతే మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీజీవో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హరితకు పూలమొక్క అందిస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే,
అదనపు కలెక్టర్ నగేశ్

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరిత