
మహాగౌరిగా అమ్మవారు
వేములవాడ: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాజన్న సన్నిధిలో అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
పురాణ నిధి యాప్ ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట సహకార సంఘ సభ్యులకు త్వరలో 8శాతం డీవిడెండ్ చెల్లించనున్నట్లు నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సంఘం మహజన సభలో మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంఘం రూ.43కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపి రూ. 36 లక్షల లాభాలు ఆర్జించడం జరిగిందన్నారు. వీటి నుంచి రూ.16లక్షలకు పైగా డీవిడెండ్ రూపంలో సభ్యుల వాటా ధనం ప్రకారం వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. సభ్యుల సహకారం, నిబద్ధత, విశ్వాసం వల్లే సంఘం విజయపరంపర కొనసాగుతోందన్నారు. సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని సభలో సభ్యులు, రైతులు తీర్మానం చేశారు. దానిని జిల్లా ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. సంఘ పరిధిలో 3,910 మంది సభ్యులుండగా, 1,491 మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారని, సభ్యులు పీఎం జీవన్ జ్యోతి, పీఎం సురక్ష బీమా చేయించుకోవాలని, ఆపద సమయంలో కుటుంబానికి ఆసరగా ఉంటాయన్నారు. సహకార శాఖ నోడల్ అధికారి గౌస్, వైస్ చైర్మన్ రామానుజాగౌడ్, బ్యాంక్ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, సీఈవో రాజిరెడ్డి, డైరెక్టర్లు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహాగౌరిగా అమ్మవారు

మహాగౌరిగా అమ్మవారు