
ఆది శేషునిపై దేవదేవుడు
శేష వాహనంపై విహరిస్తున్న స్వామివారలు
సిరిసిల్లటౌన్: భక్తల నీరాజనాలతో శ్రీశాల పురవీధుల్లో దేవదేవుడు ఆదిశేషుని వాహనంపై విహరించారు. మంగళవారం సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండోరోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయంలో రక్షాబంధనము, రుత్విక్‌వరణము, అంకురారోపణము, ధ్వజా రోహనము రాత్రి 7గంటలకు భేరిపూజ, అగ్నిప్రతిష్ట తదితర పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సహితంగా వేంకటేశ్వరస్వామిని శేషవాహనంపై ఊరేగించారు. ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ప్రధాన అర్చకస్వామి కృష్ణ్ణమాచారి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీచైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్, పెద్ది శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.