
మార్కెట్‌కు బతుకమ్మ కళ
సిరిసిల్లటౌన్: పండుగకు ఒకరోజు ముందే కార్మికక్షేత్రం సిరిసిల్ల సద్దుల బతుకమ్మ శోభను సంతరించుకుంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీచౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు, మార్కెట్, పాతబస్టాండు, పెద్దబజార్, కొత్తబస్టాండు, రైతుబజార్, గోపాల్‌నగర్ తదితర ప్రాంతాల్లో పూల విక్రయాలు కొనసాగాయి. రోడ్లపై విక్రయాలు సాగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కాగా ఈసారి బతుకమ్మ పూలు ప్రియమయ్యాయి. గునుగపూవు(మూడుకట్టలు) రూ.50, తంగేడు(మూడు కట్టలు) రూ.50, అడవిచామంతి(మూడుకట్టలు) రూ. 60, పట్టుకుచ్చులు(మూడుకట్టలు) రూ.100 చొప్పున అమ్మకాలు జరిగాయి. ఇవిగాక బతుకమ్మకు కావాల్సిన అన్నిరకాల పూలు తక్కువగా పూయడంతో డిమాండ్ పెరిగింది.

మార్కెట్‌కు బతుకమ్మ కళ

మార్కెట్‌కు బతుకమ్మ కళ