
సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
నందిగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వందన
చందుర్తి (వేములవాడ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగా ప్రతీక అని నందిగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన అన్నారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ కోర్టులో అదనపు జూనియర్ సి విల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం స్వగ్రామం చందుర్తి మండలం బండపల్లిలో తోటి మహిళలతో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వృత్తిరీత్యా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పుట్టిన పెరిగిన గ్రామస్తులతో సంబరాలు జరుపుకోవడం అదృష్టమన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. అనంతరం దుర్గామాత సన్నిధిలో జడ్జి వందనను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, వీడీసీ చైర్మన్ కటకం చంద్రయ్య, మాజీ సర్పంచ్ కటకం మల్లేశం, రెడ్డి సంఘం అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, తాడిశెట్టి తిరుపతిరెడ్డి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు లచ్చిరెడ్డి, గంప పవన్, బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.