అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Sep 30 2025 8:44 AM | Updated on Sep 30 2025 8:44 AM

అర్హు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

● విప్‌ ఆది శ్రీనివాస్‌

● విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట(వేములవాడ): అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మండలంలోని నిజామాబాద్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నాడు కాంగ్రెస్‌ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌పాషా, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, విండో చైర్మన్‌ బండ నర్సయ్య, మాజీ సర్పంచ్‌ అరుణ, నాయకులు చేపూరి గంగాధర్‌, గోపాల్‌, శోభన్‌, లంబ రాజు, బొర్ర రవి, లక్ష్మణ్‌, గొట్టె రుక్మిణి, కర్రోల్ల భాస్కర్‌, దేవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ భవనాలకు రూ.3.48 కోట్లు

వేములవాడ: వేములవాడ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ భవనాలకు రూ.3.48 కోట్ల నిధులు మంజూరైనట్లు విప్‌ ఆది శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు. రుద్రంగి మండల పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్ల నిర్మాణానికి రూ.1.08 కోట్లు, కోనరావుపేట మండల పరిధిలో రూ.96 లక్షలు, చందుర్తి మండల పరిధిలో రూ.36 లక్షలు, వేములవాడ అర్బన్‌ పరిధిలో రూ.36 లక్షలు, వేములవాడ రూరల్‌ పరిధిలో రూ.36 లక్షలు, మేడిపల్లి మండలంలోని ఎస్సీకాలనీ, భీమారం మండలం పసునూరులో, కథలాపూర్‌ మండలం అంబారిపేటలో భవనాలకు రూ.36 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వేములవాడ రూరల్‌మండలం తుర్కాశినగర్‌, వట్టెం గ్రామపంచాయతీల నిర్మాణానికి రూ.40 లక్షలు, వేములవాడ అర్బన్‌ మండలం చంద్రగిరి పంచాయతీ కోసం రూ.20 లక్షలు, కోనరావుపేట మండలం శివంగలపల్లి పంచాయతీ కోసం రూ.20 లక్షలు, చందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీ నిర్మాణానికి రూ.12.50 లక్షలు, కోనరావుపేట జూనియర్‌ కళాశాల ప్రహరీ కోసం రూ.19.60 లక్షలు, కథలాపూర్‌ మండల కేంద్రంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.17.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.

న్యాయ నిర్మాణ భవన్‌ నమూనా

సిరిసిల్లకల్చరల్‌: జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన న్యాయ నిర్మాణ భవన్‌ నమూనా ఇది. ప్రధాన ముఖ ద్వారానికి రెండు వైపులా ఐదేసి అంతస్తుల్లో సుమారు రూ.82 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనుంది. ఒక్కో అంతస్తులో మూడు కోర్టు హాళ్లు, బార్‌ అసోసియేషన్‌ హాల్‌, లైబ్రరీ, వాష్‌రూములు, విశ్రాంతి గదులను నిర్మించనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సుమారు 300 కార్లకు పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించనున్నారు.

అర్హులందరికీ    ఇందిరమ్మ ఇళ్లు
1
1/1

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement