‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’ | - | Sakshi
Sakshi News home page

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’

Aug 2 2025 10:16 AM | Updated on Aug 2 2025 10:16 AM

‘గీతక

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’

బోయినపల్లి(చొప్పదండి): గీతకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్‌లో ఈజీఎస్‌, ఎకై ్సజ్‌, గౌడసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవంలో ఈతమొక్కలు నాటారు. అనంతరం తడగొండ ప్రైమరీ పాఠశాలను తనిఖీ చేశారు. తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏపీవో సబిత, ఎంఏవో ప్రణిత, సిరిసిల్ల ఎకై ్సజ్‌ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాస్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌, సెస్‌ డైరెక్టర్‌ సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లేశ్‌యాదవ్‌ ఉన్నారు.

ప్రతీరోజు పర్మిషన్లు ఇవ్వాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇండ్లు, ప్రైవేటు నిర్మాణాల కోసం ప్రతీ రోజు ఇసుక, మట్టికి అనుమతులు ఇవ్వాలని భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. మండలంలోని బద్దెనపల్లిలో శుక్రవారం మాట్లాడారు. వారానికి రెండుసార్లు మాత్రమే అనుమతులు ఇవ్వడంతో భవన నిర్మాణాలకు ఇసుక, మట్టి సరిపోవడం లేదన్నారు. నాయకులు బద్దెనపల్లి సుదర్శన్‌, సారుగు ప్రమోద్‌, గడ్డం ఆంజనేయులు, షేర్ల సుధీర్‌, విక్రమ్‌, రవి, అరవింద్‌, వెంకటేశ్‌, బాలయ్య, సత్తయ్య పాల్గొన్నారు.

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి

సిరిసిల్లటౌన్‌: జిల్లా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఉద్యమకారులు కోరారు. కరీంనగర్‌ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరై మాట్లాడారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలను కోరినట్లు తెలిపారు. రెండేళ్లుగా జిల్లాలో ఉన్న కేసులను కరీంనగర్‌ జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారన్నారు. తమపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఉద్యమకారులు చొక్కాల రాము, కంసాల మల్లేశం, వీరవేణి మల్లేశం, మైలారం తిరుపతి తదితరులు కోరారు.

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక

సిరిసిల్లఅర్బన్‌: జిల్లా యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సాయికృష్ణ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాస్థాయి సీనియర్‌ విభాగంలో యోగా పోటీలు నిర్వహించినట్లు యోగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎలిగేటి కృష్ణ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భానోతు రశ్మిత, జి.చందన, బి.అంగురి, బి.బిందు, ఎన్‌.స్వాతి, ఎం.సుమలత, బి.బేల, జి.శ్రావణి, సీహెచ్‌.హారతిసాగర్‌, ఎస్‌.సౌమ్య, బి.పద్మ, ఎల్‌.శ్రీనివాస్‌, ఎస్‌.అఖిల్‌సాగర్‌, రామకృష్ణ, ఎన్‌.కనకయ్య ఎంపికై నట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. వీరు ఈనెల 7, 8వ తేదీల్లో ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గౌరవ సలహాదారు కరుణాల భద్రాచలం, కార్యవర్గ సభ్యులు రాజయ్య, రామకృష్ణ, కనకయ్య, శ్రీనివాస్‌, రవి పాల్గొన్నారు.

ముగిసిన ఆపరేషన్‌ ముస్కాన్‌

97 మంది బాలబాలికల సంరక్షణ

ఎస్పీ మహేశ్‌ బి గీతే

సిరిసిల్లక్రైం: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ ముగిసిందని ఎస్పీ మహేశ్‌ బి గీతే శుక్రవారం తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలతో పనిచేయిస్తున్న వారిపై 14 కేసులు నమోదు చేశామన్నారు. సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి 97 మంది బాలబాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి అప్పగించినట్లు పేర్కొన్నారు. వీధి బాలలను కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’
1
1/3

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’
2
2/3

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’
3
3/3

‘గీతకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement