
కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు
జూలపల్లి(పెద్దపల్లి): తన కొ డుకు, కోడలు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మనస్తాప ంతో జెన్‌కో ఉద్యోగి మేడుదుల రాజన్న (49) బుధవారం తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర ం లోనే ఉరివేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నాడు. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రా జన్న జూలపల్లి మండలం కాచాపూర్ 14వ మైలురా యి వద్ద గల జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు కుమారుడు సాయికుమార్, ఒక కూతురు ఉన్నారు. సాయికుమార్ 2020లో మేకల కావ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు(3) ఉన్నాడు. అయితే, ఎంబీఏ చదువుకునేందు కు సాయికుమార్ 2022లో యూకేకు వెళ్లాడు. ఆ త ర్వాత ఆయన భార్య కావ్య తనతల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. 2024లో ఇండియాకు తిరిగి వచ్చిన సాయికుమార్.. తన భార్యను కాపురానికి రమ్మని అనేకసార్లు కోరినా ఆమె తిరస్కరించింది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి పంచాయితీలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన కుమారుడి సంసారం సాఫీగా సాగడం లేదనే మనస్తాపానికి గురైన తండ్రి రాజన్న.. తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్రంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు.
మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
జలవిద్యుత్ కేంద్రంలో బలవన్మరణం